సామూహిక కార్యక్రమాలకు గవర్నర్ దూరం!
ABN , First Publish Date - 2020-03-14T01:34:47+05:30 IST
కరోనా వైరస్ (కొవిడ్-19) విజృంభిస్తున్న నేపధ్యంలో సామూహిక (మాస్ గ్యాదరింగ్) కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు.

హైదరాబాద్: కరోనా వైరస్ (కొవిడ్-19) విజృంభిస్తున్న నేపధ్యంలో సామూహిక (మాస్ గ్యాదరింగ్) కార్యక్రమాలకు దూరంగా ఉండాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇప్పటికే ఈనెల 5వ తేదీ నుంచే సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలను గవర్నర్ వాయిదా వేసుకున్నట్టు రాజ్‌భవన్ నుంచి పత్రికా ప్రకటన చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తిరిగి ప్రభుత్వం చేసే ప్రకటన వచ్చే వరకూ గవర్నర్ మాస్ గ్యాదరింగ్ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నట్టుతెలిపారు.