టీడీపీ టీఎస్ గిరిజన విభాగం అధ్యక్షుడిగా గోపి
ABN , First Publish Date - 2020-06-18T10:01:34+05:30 IST
టీడీపీ టీఎస్ గిరిజన విభాగం అధ్యక్షుడిగా గోపి
హైదరాబాద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ టీఎస్ గిరిజన విభాగం అధ్యక్షుడిగా కె. గోపి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ అనుమతితో గిరిజన విభాగం పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని టీడీపీ టీఎస్ ఉపాధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్‌నాయక్ బుధవారం ప్రకటించారు. గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందని, గిరిజన హక్కుల కోసం పోరాడుతామని నేతలు ఈ సందర్భంగా తెలిపారు.