గూగుల్ పే ప్లీజ్... కార్పొరేటర్... డబ్బు పంపినవారికి షాక్...

ABN , First Publish Date - 2020-12-15T19:53:44+05:30 IST

‘స్నేహితుడికి తీవ్ర అనారోగ్యం. అత్యవసర చికిత్సనందించాలి. డబ్బు పంపగలరు’... విజయ్ కుమార్ పేరుతో హైదరాబాద్ లో కొందరికి వచ్చిన సందేశాలివి. ఈ క్రమంలో... సదరు వ్యక్తి ఇచ్చిన ఖాతాకు రూ. 30 వేల వరకు జమ చేశారు.

గూగుల్ పే ప్లీజ్... కార్పొరేటర్... డబ్బు పంపినవారికి షాక్...

హైదరాబాద్ : ‘స్నేహితుడికి తీవ్ర అనారోగ్యం. అత్యవసర చికిత్సనందించాలి. డబ్బు పంపగలరు’... విజయ్ కుమార్ పేరుతో హైదరాబాద్ లో కొందరికి వచ్చిన సందేశాలివి. ఈ క్రమంలో... సదరు వ్యక్తి ఇచ్చిన ఖాతాకు రూ. 30 వేల వరకు జమ చేశారు.  


ప్రముఖ నాయకులు, అధికారుల పేర్లతో డబ్బులు కావాలంటూ కొందరు కేటుగాళ్ళు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనే హైదరాబాద్‌లో తాజాగా చోటుచేసుకుంది. ఈ దఫా... ఇందుకు బాధ్యుడైన వ్యక్తి ఓ ప్రముఖ పార్టీకి చెందిన కార్పొరేటర్ గా అనుమానిస్తున్నారు. కాగా... తాము మోసపోయామని గ్రహించిన కొందరు వ్యక్తులు... ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. 

Updated Date - 2020-12-15T19:53:44+05:30 IST