గొంగిడి సునీత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-07-10T22:37:14+05:30 IST

కరోనా నుంచి కోలుకుని ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స చేరారు.

గొంగిడి సునీత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

యాదాద్రి భువనగిరి: కరోనా నుంచి కోలుకుని ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆమెకు కరోనా సోకడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స చేరారు. కరోనాను సునీత జయించడంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమెతో పాటుగా టీస్కాబ్ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా రాజకీయ నాయకులను వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర హోంమంత్రి మహముద్‌ అలీకి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిద్దరూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కరోనా నుంచి బయటపడ్డారు. వీరితో పాటు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా కరోనా నుంచి కోలుకున్నారు.

Updated Date - 2020-07-10T22:37:14+05:30 IST