ఇత్తడా.. పుత్తడా?

ABN , First Publish Date - 2020-06-04T08:44:27+05:30 IST

వికారాబాద్‌ జిల్లా ఎర్రగడ్డపల్లి శివారులోని సిద్ధికి అనే రైతు పొలంలో ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో మట్టి తవ్వుతుండగా ఐదు ఇత్తడి

ఇత్తడా.. పుత్తడా?

తవ్వకాల్లో బయట పడిన గుప్త నిధులు

ఇత్తడివని తేల్చేసిన అధికారులు


పరిగి, జూన్‌ 3: వికారాబాద్‌ జిల్లా ఎర్రగడ్డపల్లి శివారులోని సిద్ధికి అనే రైతు పొలంలో ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో మట్టి తవ్వుతుండగా ఐదు ఇత్తడి చెంబులు బయటపడ్డాయి. అయితే, సదరు రైతు పొరుగున ఉన్న శ్రీనివాస్‌, యు.శ్రీనివాస్‌తో కలిసి వాటిలోని ఆభరణాలను పంచుకున్నారు. పంపకాల్లో తేడాలు రావడంతో వ్యవహారం కాస్తా పోలీసులకు వరకూ వెళ్లింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పరిగి తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి సమక్షంలో పరిశీలించారు. అయితే, వస్తువులు బంగారం కాదని, ఇత్తడిగా స్వర్ణకారుడు నిర్ధారించాడని.. మిగతా వెండి  విలువ రూ.50వేలు మాత్రమే ఉంటుందని తహసీల్దార్‌ తెలిపారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో చెంబులో ఐదు కిలోల చొప్పున చూసుకున్నా.. ఐదింటిలో 20కిలోలకు పైనే బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-06-04T08:44:27+05:30 IST