గోల్కొండ కోటకు రేపటి నుంచి అనుమతి

ABN , First Publish Date - 2020-07-05T06:45:00+05:30 IST

దాదాపు మూడున్నర నెలల అనంతరం రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు తెరుచుకోనున్నాయి. ప్రముఖ పర్యాటక స్థలాలైన

గోల్కొండ కోటకు రేపటి నుంచి అనుమతి

లంగర్‌హౌజ్‌/హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): దాదాపు మూడున్నర నెలల అనంతరం రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు తెరుచుకోనున్నాయి. ప్రముఖ పర్యాటక స్థలాలైన గోల్కొండ కోట, చార్మినార్‌, వరంగల్‌ కోటను దర్శించేందుకు సోమవారం నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర సాంస్కృతిక శాఖ అనుమతులు అందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో భారత పురావస్తు సర్వే (ఏఎ్‌సఐ) ఏర్పాట్లు చేస్తోంది. సందర్శకులు ఏఎ్‌సఐ అధికారిక వెబ్‌సైట్‌ ్చటజీ.ుఽజీఛి.జీుఽ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఎంట్రన్స్‌ల వద్ద కౌంటర్లలో టికెట్లు అందించరు. చార్మినార్‌, గోల్కొండ కోట సందర్శనకు రోజూ ఆన్‌లైన్‌లో గరిష్ఠంగా 2 వేల మందికే టికెట్లను జారీ చేస్తారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతనే సందర్శకులను అనుమతిస్తారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని అనుమతించరు.  

Updated Date - 2020-07-05T06:45:00+05:30 IST