భద్రాచలం దగ్గర మళ్లీ పెరుగుతున్న గోదావరి ప్రవాహం
ABN , First Publish Date - 2020-08-20T16:52:51+05:30 IST
భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ప్రవాహం పెరుగుతోంది.

భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువున కురుస్తున్న వర్షాలతో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరి నది నీటిమట్టం 62 అడుగులకు చేరింది... ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కాగా గురువారం ఉదయం నుంచి మళ్లీ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 44.8 అడుగులకు పెరిగింది. సుమారు 18 అడుగుల మేర తగ్గిన నీటి మట్టం మళ్లీ క్రమంగా పెరుగుతుంది.