కాంగ్రెస్‌ నేతలు తలపెట్టిన గోదావరి ప్రాజెక్టుల సందర్శన వాయిదా

ABN , First Publish Date - 2020-06-05T20:44:40+05:30 IST

కాంగ్రెస్‌ నేతలు శనివారం తలపెట్టిన గోదావరి ప్రాజెక్టుల సందర్శన వాయిదా పడింది. ఈనెల 13న గోదావరి నది ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా

కాంగ్రెస్‌ నేతలు తలపెట్టిన గోదావరి ప్రాజెక్టుల సందర్శన వాయిదా

హైదరాబాద్: కాంగ్రెస్‌ నేతలు శనివారం తలపెట్టిన గోదావరి ప్రాజెక్టుల సందర్శన వాయిదా పడింది. ఈనెల 13న గోదావరి నది ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, మంజీరా నదుల ప్రాజెక్టుల సందర్శన విషయంలో ప్రభుత్వం అనుసరించిన నిర్బంధానికి నిరసనగా కార్యక్రమాన్ని నేతలు వాయిదా వేశారు. ఈనెల 8వరకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తర్వాత కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా టీపీసీసీ నేతలు తలపెట్టిన మంజీర రిజర్వాయర్‌ సందర్శనను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ బృందాన్ని పటాన్‌చెరు టోల్‌ ప్లాజా సమీపంలో అరెస్టు చేశారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు సంగారెడ్డి జిల్లాలో ఎండిపోయిన మంజీర రిజర్వాయర్‌ను సందర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

Updated Date - 2020-06-05T20:44:40+05:30 IST