బీజేపీ మహిళా కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

ABN , First Publish Date - 2020-11-27T20:38:25+05:30 IST

టీఆర్ఎస్ కార్యకర్తలు మాపై అకారణంగా దాడి చేశారని 111వ డివిజన్ భారతీనగర్‌లో బీజేపీ మహిళా కార్యకర్తలు ఎంఐజీలోని రోడ్డు‌పై బైఠాయించి నిరసన చేపట్టారు.

బీజేపీ మహిళా కార్యకర్తలపై  టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

సంగారెడ్డి.: టీఆర్ఎస్ కార్యకర్తలు మాపై అకారణంగా దాడి చేశారని  111వ డివిజన్ భారతీనగర్‌ బీజేపీ మహిళా కార్యకర్తలు ఎంఐజీలోని రోడ్డు‌పై  బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఓటరు లిస్టు పట్టుకుని ప్రచారం చేస్తుంటే మాపై దాడికి పాల్పడ్డారని కార్యకర్తలు  చెప్పారు. ప్రచారం చేయొద్దని టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారన్నారని ఇది ఎక్కడి న్యాయమని బీజేపీ నేతలు టీఆర్ఎస్ నాయకుల వైఖరీని ఖండించారు. బీజేపీ మహిళా కార్యకర్తల పై దౌర్జన్యం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Read more