జీవో 111 ఉల్లంఘనపై చర్చకు సిద్ధమా?
ABN , First Publish Date - 2020-03-08T10:18:40+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, దీన్ని ప్రజలూ స్వాగతించట్లేదని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు. మంత్రి కేటీఆర్ లీజుకు

రేవంత్ మాటలను ప్రజలు స్వాగతించట్లేదు: తలసాని
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, దీన్ని ప్రజలూ స్వాగతించట్లేదని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్ విషయంలో జీవో 111 నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ జీవోను ఎవరు ఉల్లంఘించారో చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధమేనా?అని సవాల్ విసిరారు. శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే జీవో 111 నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయన్నారు. జన్వాడలో ఫాంహౌ్‌సను కూడా మంత్రి కేటీఆర్ నిర్మించలేదని, ఎవరో కట్టుకున్న దాన్ని లీజుకు తీసుకున్నారని పేర్కొన్నారు.
ఎంపీ రేవంత్‌రెడ్డి.. అక్కడ డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేయించడం వ్యక్తిగత ేస్వచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. వాస్తవానికి జీవో 111 రద్దు చేయాలన్న డిమాండ్ ఉందని, అయితే దానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు పార్టీలో ప్రాముఖ్యత ఏమీ తగ్గలేదని, అసెంబ్లీలోనూ ఆయన పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. సాంకేతిక సమస్య వల్ల గొర్రెలు, బర్రెల పంపిణీ పథకాన్ని నిలిపేశామని, త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. చేపల అమ్మకాల కోసం 150 మొబైల్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.