చేపల పట్టేందుకు వెళ్లి
ABN , First Publish Date - 2020-03-24T08:33:46+05:30 IST
చేపలు పట్టేందుకు తండ్రితో కలిసి వెళ్లిన చిన్నారి గుగులోత్ సాయి(7) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... గుగులోత్ రమేష్ చేపలు

చెరువులో పడి చిన్నారి మృతి
కురవి, మార్చి 23: చేపలు పట్టేందుకు తండ్రితో కలిసి వెళ్లిన చిన్నారి గుగులోత్ సాయి(7) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... గుగులోత్ రమేష్ చేపలు పట్టేందుకు వెళ్తుండగా, అతని వెంట కొడుకు సాయి వెళ్లాడు. కొడుకు చెరువు గట్టున ఆడుకుంటుండగా, రమేష్ చేపలు పట్టాడు. ఈ క్రమంలో సాయి చెరువు వద్ద కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లాడని భావించిన తండ్రి ఇంటికి వెళ్లాడు. సాయి ఇంటివద్ద లేకపోవడంతో తిరిగి చెరువు వద్దకు వెళ్లిన రమేష్ తండావాసుల సహాయంతో చెరువులో గాలించడంతో సాయి మృతదేహం చెరువులో దొరికింది. దీంతో రమేష్ కుటుంబం కన్నీరుమున్నీరైంది. వికలాంగుడైన రమేష్ భార్య ఇటీవల అనారోగ్యంతో చనిపోగా, మరో కుమారుడు ఉన్నాడు. సాయంత్రం తండాలో అంత్యక్రియలు నిర్వహించారు.