సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వండి

ABN , First Publish Date - 2020-12-13T07:48:35+05:30 IST

టీపీసీసీ చీఫ్‌ నియామకంలో సీనియారిటీ, పార్టీ సిద్ధ్దాంతాలపట్ల నమ్మకం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల

సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వండి

పీసీసీ చీఫ్‌ ఎంపికలో పరిగణనలోకి తీసుకోండి..

ఠాగూర్‌కు కాంగ్రెస్‌ సీనియర్ల విజ్ఞప్తి

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్‌ నియామకంలో సీనియారిటీ, పార్టీ సిద్ధ్దాంతాలపట్ల నమ్మకం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌కు పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్యలు సూచించారు. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆయనను కోరారు. గాంధీభవన్‌లో శనివారం ఠాగూర్‌ను కలిసిన నేతలు ఈ మేరకు ఉమ్మడి అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిసిన వారంతా..   తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.  


ఏకాభిప్రాయం సాధించాలని చెప్పాం

టీపీసీసీ అధ్యక్షుడు ఎంపికలో మెజారిటీ అభిప్రా యం కాకుండా ఏకాభిప్రాయం సాధించాలని ఠాగూర్‌కు చెప్పామని జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు.  ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రె్‌సలో చీలిక రాకుండా ఉండేందుకే పార్టీ ఇన్‌చార్జి ఠాగూర్‌ను కలిసి తమ మనసులో ఉన్నది చెప్పామన్నారు. సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దన్నారు. సోనియాగాంధీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.


 కార్పొరేషన్ల ఎన్నికలకు సన్నద్ధం కావాలి

త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధం కావాలని టీపీసీసీ నిర్ణయించింది. రెండు కార్పొరేషన్లకు విడివిడిగా మేనిఫెస్టోలు రూపొందించాలన్న నిర్ణయమూ తీసుకుంది. రెండు కార్పొరేషన్ల ఎన్నికలు, రెండు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపైన గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ సమీక్ష జరిపారు.

ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T07:48:35+05:30 IST