రంజాన్‌లాగే బోనాలకూ మార్గదర్శకాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-06-18T10:05:47+05:30 IST

బోనాల పండుగ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని, బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారంటూ ఒక హిట్లర్‌లా, నిజాంలా వ్యవహరిస్తే

రంజాన్‌లాగే బోనాలకూ మార్గదర్శకాలు ఇవ్వండి

  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ 

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): బోనాల పండుగ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని, బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారంటూ ఒక హిట్లర్‌లా, నిజాంలా వ్యవహరిస్తే వినడానికి మీ నౌకర్లం కాదు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్‌ తక్షణం ఒక సమావేశం ఏర్పాటు చేసి రంజాన్‌ మాదిరిగానే బోనాలపై  మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ ఇంటి నుంచి అమ్మ వారికి బోనాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోందని, కనీసం ఇంటికి ఒక్కరినైనా బోనాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రతీ ఇంటి నుంచి ఒక మహిళ బోనాలు తీసుకువెళ్లి కరోనా వంటి రోగాలను పోగొట్టాలని అమ్మవారిని ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-06-18T10:05:47+05:30 IST