బడుల ప్రారంభంపై అభిప్రాయాలు తెలపండి

ABN , First Publish Date - 2020-07-20T08:51:45+05:30 IST

పాఠశాలల పునఃప్రారంభంపై అభిప్రాయాలు తెలపాలని విద్యార్థుల తల్లిదండ్రులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కోరింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో

బడుల ప్రారంభంపై అభిప్రాయాలు తెలపండి

  • తల్లిదండ్రుల సూచనలు కోరిన కేంద్రం

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల పునఃప్రారంభంపై అభిప్రాయాలు తెలపాలని విద్యార్థుల తల్లిదండ్రులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కోరింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎప్పుడు ప్రారంభిస్తే అనువుగా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? వంటి అభిప్రాయాలను స్వీకరించి సోమవారంలోగా ఈ-మెయిల్‌ ద్వారా పంపాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రాజేశ్‌ సాంప్లే ఆదివారం అన్ని రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులను కోరారు.

Updated Date - 2020-07-20T08:51:45+05:30 IST