లేబర్‌ సొసైటీల బలోపేతానికి 100 కోట్లు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-12-30T06:52:43+05:30 IST

తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కోసం కృషి చేస్తోన్న 5,200 లేబర్‌ సొసైటీల బలోపేతానికి రూ.100 కోట్లు కేటాయించాలని నేషనల్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సంతోష్‌

లేబర్‌ సొసైటీల బలోపేతానికి 100 కోట్లు ఇవ్వండి

కేంద్రానికి నేషనల్‌ లేబర్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ వినతి 


హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కోసం కృషి చేస్తోన్న 5,200 లేబర్‌ సొసైటీల బలోపేతానికి రూ.100 కోట్లు కేటాయించాలని నేషనల్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌కు ఆ సమాఖ్య డైరెక్టర్‌ దండుగుల రాజ్యలక్ష్మి వినతి పత్రం ఇచ్చారు. మంగళవారం సంతోష్‌ కుమార్‌ను ఆమె నేషనల్‌ లేబర్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 43వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కలిశారు. హైదరాబాద్‌లో నేషనల్‌ లేబర్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయ భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరారు.

Updated Date - 2020-12-30T06:52:43+05:30 IST