ఆడబిడ్డ.. మా ఇంటి మహాలక్ష్మి!

ABN , First Publish Date - 2020-12-27T08:03:38+05:30 IST

ఆ దంపతులకు ఆడ బిడ్డ పుట్టింది. ఆ పాప రాక కోసం ఇంట్లో నానమ్మ,

ఆడబిడ్డ.. మా ఇంటి మహాలక్ష్మి!

ఆ దంపతులకు ఆడ బిడ్డ పుట్టింది. ఆ పాప రాక కోసం ఇంట్లో నానమ్మ, బాబాయి, ఆత్తమ్మ అంతా ఎదురుచూశారు. ప్రసవం తర్వాత మూడు నెలలకు హైదరాబాద్‌లోని తల్లిగారి ఇంటి నుంచి బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి శనివారం ఇంటికొస్తే వారి ఆనందం అంతా ఇంతాకాదు. పుట్టిన ఆడబిడ్డ తమ పాలిట లక్ష్మీదేవిగా భావిస్తూ పూలబాటతో స్వాగతం పలికారు.


 ఆ బిడ్డకు పట్టుబట్టలు తొడిగి, గదిలో పూలతో అలకరించిన పాన్పుపై పడుకోబెట్టారు. ఈ స్వాగతం అందుకుంది మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం స్టేషన్‌కు చెందిన వెలిశాల సవీన్‌-రమ్య దంపతుల బిడ్డ నమస్వి! 

- కేసముద్రం


Updated Date - 2020-12-27T08:03:38+05:30 IST