విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌

ABN , First Publish Date - 2020-12-28T04:59:01+05:30 IST

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌

చిన్నారికి గాయాలు 

పలిమెల(మహదేవపూర్‌ రూరల్‌), డిసెంబరు 27 : బైక్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో చిన్నారికి గాయాలయ్యాయి. ఈఅ సంఘటన పలిమెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెలకు చెందిన జనగామ తిరుపతి మహదేవపూర్‌ మండలంలోని ఎడపెల్లి నుంచి తన కూతురు అంజలి, మనవరాలు లక్కీ(5)ని తీసుకొచ్చేందుకు బయల్దేరాడు. లెంకలగడ్డ-పంకెన అటవీ ప్రాంతంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో  లక్కీ తలకు బలమైన గాయమైంది. చిన్నారిని మహదేవపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  అనంతరం మెరుగైన వైద్యం కోసం  వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Updated Date - 2020-12-28T04:59:01+05:30 IST