ట్విటర్‌లో ‘జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్‌’ ట్రెండింగ్‌!

ABN , First Publish Date - 2020-12-05T09:04:02+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై సోషల్‌మీడియా వేదికగా విస్తృత చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సమానంగా సీట్లు వస్తుండడంతో ఫేస్‌బుక్‌,

ట్విటర్‌లో ‘జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్‌’ ట్రెండింగ్‌!

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై సోషల్‌మీడియా వేదికగా విస్తృత చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సమానంగా సీట్లు వస్తుండడంతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో నెటిజన్లు వేలాది పోస్టింగ్‌లు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల అంశం ట్విటర్‌లో జాతీయస్థాయిలో శుక్రవారం ట్రెండింగ్‌ అయింది. జీహెచ్‌ఎంసీ రిజల్స్ట్‌ హ్యాష్‌ట్యాగ్‌పై 45 వేల ట్వీట్లు చేయడం గమనార్హం.


జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై 17వేలు, ఫలితాలపై 12 వేల ట్వీట్లు చేశారు. ఈ మూడు హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో టాప్‌టెన్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ రిజల్ట్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొదటిస్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. మిగతావి సాయంత్రం వరకు టాప్‌టెన్‌లో కొనసాగాయి. 


Updated Date - 2020-12-05T09:04:02+05:30 IST