పరీక్షలతోనే మాంసంలో కల్తీ తెలుస్తుంది

ABN , First Publish Date - 2020-04-26T08:51:27+05:30 IST

మాంసంలో కల్తీ జరిగిందా? లేదా.. అనే విషయం పరీక్షలు నిర్వహించిన తర్వాతనే తేలుతుందని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ ..

పరీక్షలతోనే మాంసంలో కల్తీ తెలుస్తుంది

  • జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మాంసంలో కల్తీ జరిగిందా? లేదా.. అనే విషయం పరీక్షలు నిర్వహించిన తర్వాతనే తేలుతుందని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ ఓ ప్రకటనలో వివరించారు. ‘మిక్సింగ్‌ మాఫియా’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై శనివారం ఆయన వివరణ ఇచ్చారు. మాంసం శాంపిళ్లను పరీక్షించే సదుపాయం కేవలం సీసీఎంబీ, చెంగిచర్లలోని జాతీయ మాంసం పరిశోధన సంస్థలలో మాత్రమే ఉందని తెలిపారు. ఫలితాలు రావడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని అన్నారు. మాంసంలో బీఫ్‌(గొడ్డు మాంసం)ను కలిపిన విషయాన్ని వెటర్నరీ అధికారులు షాపుల వద్దే నిర్ధారించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కాగా, లాక్‌డౌన్‌ కాలంలో మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం నిఘా పెట్టిందని చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ తెలిపారు. ఇప్పటివరకు 113 మంది మాంసం వ్యాపారులను ప్రాసిక్యూట్‌ చేశామని, రూ.99,900 అపరాధ రుసుము వసూలు చేశామని, 190 కిలోల మాంసం, 221 కిలోల గొడ్డు మాంసాన్ని సీజ్‌ చేశామని వివరించారు.

Updated Date - 2020-04-26T08:51:27+05:30 IST