సూపర్ మార్కెట్‌లను సీజ్ చేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు
ABN , First Publish Date - 2020-04-25T20:09:51+05:30 IST
హైదరాబాద్: సూపర్ మార్కెట్‌లను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేస్తున్నారు. చందానగర్‌లోని విజేత సూపర్ మార్కెట్, మధురా నగర్‌లోని వాల్ మార్ట్‌లను..

హైదరాబాద్: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన సూపర్ మార్కెట్‌లను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేస్తున్నారు. శనివారం నాడు చందానగర్‌లోని విజేత సూపర్ మార్కెట్, మధురా నగర్‌లోని వాల్యూ మార్ట్‌లను జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం సీజ్ చేసింది. సూపర్ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించకుండా, ఒకేసారి ఎక్కువ మందిని లోపలికి పంపడం, ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉండటం వలన సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు మీడియాకు తెలిపారు.