సర్వీసు క్రమబద్ధీకరణ మోయలేని భారం
ABN , First Publish Date - 2020-10-01T08:44:03+05:30 IST
జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాల్లో 28వేల మంది ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారని.. వారికి టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తే రూ.625కోట్ల అదనపు భారం....
హైకోర్టుకు నివేదించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్, సెప్టెంబర్ 30(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాల్లో 28వేల మంది ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నారని.. వారికి టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తే రూ.625కోట్ల అదనపు భారం కార్పొరేషన్‌పై పడుతుందని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ నివేదించారు. జీహెచ్‌ఎంసీలో పదే ళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న 98 మంది సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చి న ఆదేశాలపై దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌లో.. జీహెచ్‌ఎంసీ కౌంటర్ వేసింది. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో 16.3శాతం సిబ్బంది వేతనాల కోసం ఖర్చు చేస్తున్నట్లు కౌంటర్‌లో పేర్కొన్నారు. సర్వీసు క్రమబద్ధీకరించాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారనే కారణంతో ప్రభుత్వంపై మోయలేని ఆర్థిక భారం వేయడానికి వీల్లేదని.. ఉమాదేవి కేసులో జారీ చేసిన ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు.