జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి

ABN , First Publish Date - 2020-11-19T21:38:11+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని ఎస్ఈసీ విడుదల చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఉన్నాయి. కాగా, డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా,

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని ఎస్ఈసీ విడుదల చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఉన్నాయి. కాగా, డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 


* గోడల మీద రాతలు, పోస్టర్లు/పేపర్లు అంటించుట, లేక మరే ఇతర విధంగా కానీ ప్రభుత్వ ఆవరణలను (భవనాలు మొదలైన కట్టడాలు) పాడు చేయుట నిషేదం. 

* పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్‌తో తయారైన పోస్టర్లు/ బ్యానర్ల వాడకం నివారించేందుకు ప్రయత్నించాలి.

* ఎన్నికల కరపత్రం లేక పోస్టరుపై ఆ ప్రింటరు, పబ్లిషరు పేర్లు, అడ్రస్సులు లేకుండా ముంద్రించడం, ప్రచురించడం నిషేధం.

*  ప్రత్యేక ఉపకరణాలు ధరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వాటికి అయ్యే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో నమోదు చేయాలి.

* ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి అభ్యర్థి తన ఎన్నికల నిమిత్తం ప్రజలకు, సినిమాటోగ్రఫి, టెలివిజన్ లేదా ఇతర తత్సమాన  ప్రచార సాధనాలు వినియోగించుట నిషేదం.

* లౌడ్ స్పీకర్లు వాడడానికి సంబంధిత పోలీసు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి.

* బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనలలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య, ఇతర సందర్భాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇచ్చింది.

* పబ్లిక్ సమావేశాలు రాత్రి 10 గంటల దాటిన తరువాత, అలాగే ఉదయం 6 గంటల కన్నా ముందు నిర్వహించరాదు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు. 

* అధికారిక యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫోటో గుర్తింపు స్లిప్ జారీ చేస్తున్నందున, అభ్యర్థులు అనధికారిక గుర్తింపు స్లిప్స్ ఇవ్వకూడదు.

Updated Date - 2020-11-19T21:38:11+05:30 IST