వరంగల్‌కు జీహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్‌ బృందాలు

ABN , First Publish Date - 2020-08-16T22:23:50+05:30 IST

భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరంగల్‌లో సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి జీహెచ్‌ఎంసికి చెందిన మూడు డిఆర్‌ఎఫ్‌ బృందాలు వరంగల్‌కు బయలు దేరి వెళ్లాయి.

వరంగల్‌కు జీహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్‌ బృందాలు

హైదరాబాద్‌: భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరంగల్‌లో సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి జీహెచ్‌ఎంసికి  చెందిన మూడు డిఆర్‌ఎఫ్‌ బృందాలు వరంగల్‌కు బయలు దేరి వెళ్లాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరావాస చర్యల్లో ఈ బృందాలు పాల్గొంటాయి. ఈ మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్టు విడిఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ బృందాలు వరంగల్‌ చేరుకుంటాయని అన్నారు. మూడు డిఆర్‌ఎఫ్‌ వాహనాలు, ఒక బోటు, ఇతర సాధన సామగ్రితో 40 మంది సిబ్బంది హైదరాబాద్‌ నుంచి వెళ్లినట్టు తెలిపారు. 

Updated Date - 2020-08-16T22:23:50+05:30 IST