జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో రసాభాస

ABN , First Publish Date - 2020-02-08T21:05:52+05:30 IST

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రజలను పీడిస్తోందని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు.

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో రసాభాస

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రజలను పీడిస్తోందని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. భారీగా వేస్తున్న జరిమానాలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం భారీగా అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ రాజీనామా చేయాలని ఎంఐఎం డిమాండ్‌ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఫైన్లపై కమిటీ వేస్తూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. సీఏఏపై చర్చకు ఎంఐఎం పట్టుబట్టింది. దీంతో బీజేపీ  కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ఎంఐఎం ప్రతిపాదనకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేసింది. దీంతో సమావేశం రాసాభాసగా మారింది. ఇరువర్గాలను మేయర్ బొంతు రామ్మోహన్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడం మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. 

Updated Date - 2020-02-08T21:05:52+05:30 IST