హైదరాబాద్‌లో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులు

ABN , First Publish Date - 2020-07-15T03:02:26+05:30 IST

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులను నియమించింది.

హైదరాబాద్‌లో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 8 మంది ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక అధికారులుగా ముగ్గురు ఐఏఎస్, ఐదుగురు అడిషనల్ కమిషనర్లను నియమించింది. వీరి నియామకానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కేసులు అధికంగా వచ్చిన సర్కిళ్లలో కంటైన్మెంట్ జోన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఒక్కో జోన్‌కు ఒక్కో అధికారిని నియమించింది. శేరిలింగంపల్లి జోన్‌కు అడిషనల్ కమిషనర్ యాదగిరి రావును నియమించింది. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్‌కు అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెన్నేడి, ఖైరతాబాద్ జోన్‌కు అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కార్వాన్ సర్కిల్‌కు జే.సి సంధ్యను నియమించారు. ఇక చార్మినార్‌ జోన్‌కు కమిషనర్ విజయలక్ష్మి, చార్మినార్ ప్రాంతానికి అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్, రాజేంద్ర  నగర్‌కు అడిషనల్ కమిషనర్ సంతోష్, కుత్బుల్లాపూర్‌కు ఇన్‌చార్జిగా ప్రియాంకను నియమించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-07-15T03:02:26+05:30 IST