కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు..
ABN , First Publish Date - 2020-12-10T10:18:33+05:30 IST
వరద సహాయం పంపిణీ కొనసాగుతుందని, ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. గతంలో మీ-సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి..

వరద సహాయం కొనసాగుతుంది: జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): వరద సహాయం పంపిణీ కొనసాగుతుందని, ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. గతంలో మీ-సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు చొప్పున జమ చేస్తున్నామని అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 17,333 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ.17.33కోట్లు బదిలీ చేశామన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారికి సహాయం ఎలా అందించాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధుల జోక్యం, కొంతమంది నేతల చేతివాటం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది అవినీతితో సహాయం దారి తప్పిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీ ప్రణాళికతో సహాయం పంపిణీ చేపట్టాలని నిర్ణయించినట్లు ఒక అధికారి పేర్కొన్నారు.