యూకే పాజిటివ్‌ల జన్యు విశ్లేషణ పూర్తి
ABN , First Publish Date - 2020-12-28T08:47:01+05:30 IST
యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన ఇద్దరు ప్రయాణికుల నమూనాల జన్యు విశ్లేషణ పూర్తయింది. ఈ ప్రక్రియను చేపట్టిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)..

ప్రభుత్వానికి సీసీఎంబీ నివేదిక
బయటకు వెల్లడికాని వివరాలు
స్ట్రైయిన్ నిర్ధారణ అనుమానాలు!
నేడు స్పందించనున్న మంత్రి ఈటల
హైదరాబాద్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో కరోనా పాజిటివ్‌గా తేలిన ఇద్దరు ప్రయాణికుల నమూనాల జన్యు విశ్లేషణ పూర్తయింది. ఈ ప్రక్రియను చేపట్టిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ).. ఫలితాల వివరాలను ఆదివారం ఉదయం నివేదిక రూపంలో కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు పంపింది. కాగా, ఆ నివేదికలో ఏముందన్న విషయాన్ని వెల్లడించేందుకు సీసీఎంబీ ఉన్నతాధికారులు నిరాకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సైతం సీసీఎంబీ ఇచ్చిన నివేదికపై ఏమీ చెప్పలేదు. అధికార యంత్రాంగం కూడా స్పందించలేదు. దీంతో నమూనాల్లో.. యూకే స్ట్రెయిన్ ఉన్నట్లు తేలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రజల్లో అనవసర భయాందోళనలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే నివేదికను బహిర్గతం చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాగా, సీసీఎంబీ నివేదికపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సోమవారం స్పందిస్తారని శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.