పవర్‌హౌస్‌ పరిరక్షణకు ప్రాణాలొడ్డారు!

ABN , First Publish Date - 2020-08-22T08:31:07+05:30 IST

శ్రీశైలం పవర్‌హౌ్‌సలో గురువారం రాత్రి చోటు చేసుకున్న దుర్ఘటనలో తమ ప్రాణాల కంటే జల విద్యుత్తు కేంద్రం

పవర్‌హౌస్‌ పరిరక్షణకు ప్రాణాలొడ్డారు!

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం పవర్‌హౌ్‌సలో గురువారం రాత్రి చోటు చేసుకున్న దుర్ఘటనలో తమ ప్రాణాల కంటే జల విద్యుత్తు కేంద్రం పరిరక్షణకే జెన్‌కో సిబ్బంది ప్రాధాన్యతనిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తమను మృత్యువు కబళిస్తోందని తెలిసినా.. చివరి క్షణం వరకూ మంటలను ఆర్పేందుకు సిబ్బంది చొరవ చూపారని తెలిపారు. గురువారం రాత్రి 10.30కు అగ్నిప్రమాదం, పేలుళ్లు సంభవించగా.. అర్ధరాత్రి 12 గంటల వరకూ లోపల ఉన్న జెన్‌కో సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారని చెప్పారు.

Updated Date - 2020-08-22T08:31:07+05:30 IST