త్వరలో పట్టాలపైకి గజ్వేల్‌ రైలు

ABN , First Publish Date - 2020-06-19T10:06:04+05:30 IST

గజ్వేల్‌ ప్రజల దశాబ్దాల కల అతి త్వరలోనే సాకారం కానుంది. కొద్ది రోజుల్లోనే కూత వేసుకుంటూ రైలు గజ్వేల్‌కు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్‌ -

త్వరలో పట్టాలపైకి గజ్వేల్‌ రైలు

  • ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • రైలు నడిపేందుకు లైన్‌ క్లియర్‌ 

గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక రైలుకు పూజలు నిర్వహిస్తున్న అధికారులు 


గజ్వేల్‌, జూన్‌ 18: గజ్వేల్‌ ప్రజల దశాబ్దాల కల అతి త్వరలోనే సాకారం కానుంది. కొద్ది రోజుల్లోనే కూత వేసుకుంటూ రైలు గజ్వేల్‌కు పరుగులు తీయనుంది. సికింద్రాబాద్‌ - కరీంనగర్‌ రైలు మార్గం నిర్మాణంలో భాగంగా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు నిర్మించిన 31.5 కిలోమీటర్ల తొలి దశ రైల్వే మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ గురువారం పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలుకు ప్రత్యేక పూజలు చేసి, మనోహరాబాద్‌ వరకు సింగిల్‌ లైన్‌ బ్రాడ్‌ గేజ్‌పై 110 కిలోమీటర్ల వేగంతో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.


ట్రాలీల్లో ప్రయాణిస్తూ, పట్టాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ట్రాక్‌, స్పీడ్‌, ఆర్వోబీ, ఆర్‌యూబీ, బ్రాడ్‌గేజ్‌తో పాటు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించామని, ట్రయల్‌ రన్‌ విజయవంతమైందని చెప్పారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగిల్‌ రైలును త్వరలోనే నడిపించనున్నట్లు వెల్లడించారు. సేఫ్టీ కమిషనర్‌ వెంట అధికారులు రమేశ్‌కుమార్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, జనార్దన్‌, సోమరాజు తదితరులున్నారు. Updated Date - 2020-06-19T10:06:04+05:30 IST