కాగజ్‌నగర్ మిల్లులో గ్యాస్ లీక్

ABN , First Publish Date - 2020-05-11T20:58:51+05:30 IST

అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో సోమవారం గ్యాస్ లీకైంది. దీంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు అస్వస్థతకు లోనయ్యారు. గ్యాస్ లీకేజీకి కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

కాగజ్‌నగర్ మిల్లులో గ్యాస్ లీక్

సిర్పూర్ : అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో సోమవారం గ్యాస్ లీకైంది. దీంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు అస్వస్థతకు లోనయ్యారు. గ్యాస్ లీకేజీకి కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. 


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లులో గ్యాస్ లీక్ కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే సంఘటన అంత తీవ్రమైనది కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కార్మికులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ప్రమాదాల నివారణకు తక్ణణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-05-11T20:58:51+05:30 IST