వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-08-16T09:53:49+05:30 IST

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు హైదరాబాద్‌ నగర శివార్లలో వెయ్యి కిలోల గంజాయిని...

వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు హైదరాబాద్‌ నగర శివార్లలో వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ. 2.65 కోట్లు ఉంటుందని అంచనా. విశాఖ ఏజెన్సీ నుంచి సరుకు రవాణా వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు 1,050 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు ఉప్పందుకున్న అధికారులు.. శుక్రవారం సాయంత్రం దాడులు జరిపి సరుకును సీజ్‌ చేశారు. నిందితులు కంటైనర్‌ లారీలో ఖాళీ ట్రేల వెనకాల గంజాయిని ప్యాక్‌ చేసినట్లు అధికారులు వివరించారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశామని, లారీ సహా గంజాయిని సీజ్‌ చేశామని తెలిపారు.

Updated Date - 2020-08-16T09:53:49+05:30 IST