రబీకి 4వేలకుపైగా ఐకేపీ కేంద్రాలు: గంగుల

ABN , First Publish Date - 2020-03-13T09:36:00+05:30 IST

ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వరిసాగు భారీగా పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఖరీఫ్‌ కన్నా రబీలో ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 3670 ఐకేపీ కేంద్రాలను

రబీకి 4వేలకుపైగా ఐకేపీ కేంద్రాలు: గంగుల

ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో వరిసాగు భారీగా పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఖరీఫ్‌ కన్నా రబీలో ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి 3670 ఐకేపీ కేంద్రాలను 4వేలకుపైగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. రజకులకు 8 జిల్లాల్లో నూతన మిషన్లు ఇచ్చామని, త్వరలోనే అన్నిజిల్లాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌ షాపులను ఏర్పాటు చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-03-13T09:36:00+05:30 IST