గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం

ABN , First Publish Date - 2020-10-03T21:02:17+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం వెలుగుచూసింది.

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం వెలుగుచూసింది. నయీం కేసులో 25మంది పోలీస్ అధికారులకు సిట్‌ క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలున్నట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 25 మంది పోలీస్ అధికారులపై ల్యాండ్ సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ఆరోపణలున్నాయి. ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా 25 మందికి సిట్ అధికారులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు.


నయీం కేసులో 175కి పైగా సిట్ చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఇందులో 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ వరకు అందరికీ ఇవాళ సిట్ క్లీన్‌చిట్ ఇచ్చేసింది. నయీం కేసులో 25 మంది పోలీస్ అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ రాసిన లేఖకు సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి పై విధంగా సమాధానం ఇచ్చారు.


నయీం కేసులో క్లీన్‌చిట్ పొందిన పోలీస్ అధికారులు

అడిషనల్ ఎస్పీలు :

శ్రీనివాసరావు

చంద్రశేఖర్


డీఎస్పీలు : 

సీహెచ్‌.శ్రీనివాస్

ఎం.శ్రీనివాస్

సాయి మనోహర్‌

ప్రకాష్‌రావు

వెంకట నరసయ్య

అమరేందర్‌రెడ్డి

తిరుపతన్న


సీఐలు : 

మస్తాన్‌

రాజగోపాల్

వెంకటయ్య

శ్రీనివాస్ నాయుడు

కిషన్

ఎస్‌.శ్రీనివాసరావు

వెంకట్‌రెడ్డి

మజీద్

వెంకట సూర్యప్రకాష్‌

రవికిరణ్‌ రెడ్డి

బలవంతయ్య

నరేందర్‌గౌడ్

రవీందర్‌


కానిస్టేబుళ్లు :

దినేష్‌ ఆనంద్

బాలన్న

సదాత్‌ మియా.

Updated Date - 2020-10-03T21:02:17+05:30 IST