నకిలీ భూ పత్రాలతో బ్యాంక్‌ లోన్ తీసుకున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-21T02:18:09+05:30 IST

నకిలీ భూ పత్రాలతో బ్యాంక్‌ లోన్ తీసుకొని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2012లో బ్యాంక్‌ ఆఫ్ మహారాష్ట్రలో నిరంజన్, కృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రభాకర్

నకిలీ భూ పత్రాలతో బ్యాంక్‌ లోన్ తీసుకున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: నకిలీ భూ పత్రాలతో బ్యాంక్‌ లోన్ తీసుకొని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2012లో బ్యాంక్‌ ఆఫ్ మహారాష్ట్రలో నిరంజన్, కృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రభాకర్‌ రూ.1.08 కోట్ల లోన్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దశలవారిగా లోన్ డబ్బులు కట్టకపోవడంతో బ్యాంక్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో నిందితులపై సీసీఎస్ పోలీసులకు బ్యాంక్ మేనేజర్ పిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-08-21T02:18:09+05:30 IST