వాళ్లు ఇళ్ల నుంచి బయటికి రావద్దు: డాక్టర్ శ్రవణ్ కుమార్

ABN , First Publish Date - 2020-03-19T18:20:25+05:30 IST

హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఇళ్ల నుంచి బయటికి రావద్దని గాంధీ ఆస్పత్రి..

వాళ్లు ఇళ్ల నుంచి బయటికి రావద్దు: డాక్టర్ శ్రవణ్ కుమార్

హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వాళ్లు ఇళ్ల నుంచి బయటికి రావద్దని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్ కుమార్ సూచించారు. గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరు కరోనా వైరస్ రాకుండా కాపాడుకోవాలని సూచించారు. అనుమానం వస్తే ప్రతి ఒక్కరు స్వచ్ఛంధంగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలన్నారు. కరోనా స్టేజ్‌-2 రాకుండా కాపాడుకోవాలన్నారు. ఏదైనా బస్తీ నుంచి కరోనా కేసు వస్తే చాలా ప్రమాదకరమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు.

Updated Date - 2020-03-19T18:20:25+05:30 IST