గాంధీ ఆస్పత్రిలో కోట్ల స్కాం జరుగుతోంది: వసంత్

ABN , First Publish Date - 2020-02-12T21:56:15+05:30 IST

డీఎంఈ రమేష్ రెడ్డి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ వ్యక్తిగత కక్షలతోనే తనను డీహెచ్‌కు సరెండర్ చేశారని డాక్టర్ వసంత్ ఆరోపించారు. గాంధీ హాస్పిటల్‌లో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని

గాంధీ ఆస్పత్రిలో కోట్ల స్కాం జరుగుతోంది: వసంత్

హైదరాబాద్: డీఎంఈ రమేష్ రెడ్డి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ వ్యక్తిగత కక్షలతోనే తనను డీహెచ్‌కు సరెండర్ చేశారని డాక్టర్ వసంత్ ఆరోపించారు. గాంధీ హాస్పిటల్‌లో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. రమేష్ రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని, పోస్టింగ్ కోసం డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. ఈ విషయాలపై ప్రశ్నిస్తున్నందుకే తనకు ఈ గతి పట్టిందని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన వసంత్.. తాను అసలు కరోనాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. వారే వదంతులు సృష్టించి తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ సంతకాలు ఫోర్జరీ చేస్తారని ఆరోపించారు. ప్రమోషన్లలో సీనియర్లను కాదని జూనియర్లకు డబ్బులు తీసుకొని ఇస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ, శానిటేషన్‌లో రూ. కోట్లలో స్కామ్ జరుగుతోందన్నారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వసంత్ తెలిపారు. కేసులకు భయపడేది లేదన్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అటెండర్ల పేరు మీద ఉన్న ఆస్తులు, తన ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తనది తప్పు అని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం అని ప్రకటించారు.

Updated Date - 2020-02-12T21:56:15+05:30 IST