‘గాంధీ’లో హై అలర్ట్‌

ABN , First Publish Date - 2020-03-04T09:08:20+05:30 IST

కరోనా బాధితుడు చికిత్స పొందుతున్న గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక వార్డు పరిసరాల్లో సంచారంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. బాధితుడికి

‘గాంధీ’లో హై అలర్ట్‌

కరోనా వార్డు పరిసరాల్లో నిషేధాజ్ఞలు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి పరీక్షలు

దుబాయ్‌ నుంచి వచ్చిన కామారెడ్డి వ్యక్తికి కూడా..

కామారెడ్డిటౌన్‌, అడ్డగుట్ట/ హన్మకొండ అర్బన్‌/ హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితుడు చికిత్స పొందుతున్న గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక వార్డు పరిసరాల్లో సంచారంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. బాధితుడికి సన్నిహితంగా మెలిగినవారిలో 36 మందిని మంగళవారం ఇక్కడకు తీసుకొచ్చారు. వారిని ఇతరులు కలవకుండా జాగ్రత్తలు చేపట్టారు. స్వైన్‌ప్లూ బాధితులను కరోనా వార్డులకు దూరంగా ఉంచారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద కరోనా వార్డు మార్గాల సూచికలు ఉంచారు.


మరోవైపు వరంగల్‌ ఎంజీఎంలో మాతాశిశు సంరక్షణ కేంద్రం నూతన భవనంలో 25 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అనుమానిత లక్షణాల నేపథ్యంలో సోమవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఒకరిని ముందస్తు వైద్య పరీక్షలకు గాంధీకి తరలించారు. వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చి తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న కామారెడ్డికి చెందిన వ్యక్తిని గాంధీకి రిఫర్‌ చేశారు. 

Updated Date - 2020-03-04T09:08:20+05:30 IST