శ్రీనివాస్‌యాదవ్‌ అంతిమయాత్రలో పాల్గొననున్న బండి సంజయ్‌

ABN , First Publish Date - 2020-11-06T15:33:50+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా నవంబర్‌1న ఆత్మహత్యాయత్నం చేసిన..

శ్రీనివాస్‌యాదవ్‌ అంతిమయాత్రలో పాల్గొననున్న బండి సంజయ్‌

రంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా నవంబర్‌1న ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో యాచారం మండలం, తుమ్మలోనిగూడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేవారు. మరి కాసేపట్లో శ్రీనివాస్‌యాదవ్ అంతిమయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొననున్నారు. శ్రీనివాస్‌యాదవ్ కాలిన గాయాలతో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భారీ భద్రత మధ్య ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి చేశారు.


దుబ్బాక ఉప ఎన్నిక ఘటనల నేపథ్యంలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టును నిరసిస్తూ, నవంబర్‌1 ఆదివారం శ్రీనివాస్‌ యాదవ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడిని మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అదే రోజు సికింద్రాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రికి మార్చారు. శరీరం 60 శాతంపైగా కాలిపోవడంతో శ్రీనివాస్‌ కోలుకోవడం కష్టమైంది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రచారం కావడంతో బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 


శ్రీనివాస్‌ది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెం గ్రామం. తల్లి సత్తమ్మ, తండ్రి ఐలయ్య, అన్న శ్రీశైలం ఉన్నారు. ఇబ్రహీంపట్నలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. మూడేళ్లుగా నగరంలో కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 

Updated Date - 2020-11-06T15:33:50+05:30 IST