నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలి
ABN , First Publish Date - 2020-12-27T08:22:33+05:30 IST
మండల పరిషత్‌లకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని ఎంపీటీసీ సభ్యుల సంఘం రాష్ట్ర

ఎంపీటీసీ సభ్యుల సంఘం డిమాండ్
హైదరాబాద్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌లకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలని ఎంపీటీసీ సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఎంపీటీసీల సంఘం 2021 సంవత్సర క్యాలెండర్‌ను హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో శనివారం ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.