కార్యాలయ నిర్వహణకు నిధులివ్వండి

ABN , First Publish Date - 2020-09-20T06:47:17+05:30 IST

తహసీల్దార్ల వాహనాల అలవెన్సు నిధులతోపాటు కార్యాలయ నిర్వహణ ఖర్చుకు అవసరమైన నిధులు విడుదల

కార్యాలయ నిర్వహణకు నిధులివ్వండి

 మంత్రి హరీశ్‌రావుకు  ట్రెసా  విజ్ఞప్తి 


హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ల వాహనాల అలవెన్సు నిధులతోపాటు కార్యాలయ నిర్వహణ ఖర్చుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావును ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వి.రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధులు కలిసి, వినతిపత్రాన్ని అందజేశారు.


అంతకుముందు సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌తో వీరు భేటీ అయ్యారు. రిజిస్ట్రేషన్‌ విధులు మొదలు కాకముందే తగినంత సిబ్బందిని నియమించడంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీలను వీఆర్‌వోలతో భర్తీ చేయాలని కోరారు. సీఎం ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించాలని, ధరణి పెండింగ్‌ సమస్యలను క్లియర్‌ చేయాలని, తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ విధులపై శిక్షణ ఇప్పించాలని, అన్ని కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో బడ్జెట్‌ కేటాయించాలని  కోరారు. ఈ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళతానని స్మితా సభర్వాల్‌ వారికి హామీ ఇచ్చారు. మంత్రిని, అధికారులను కలిసిన వారిలో ట్రెసా ప్రతినిధులు రియాజుద్దీన్‌, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, పి.శ్రీనివా్‌సరెడ్డి, రమణ్‌రెడ్డి, రాజ్‌కుమార్‌  ఉన్నారు. 

Updated Date - 2020-09-20T06:47:17+05:30 IST