జూన్ నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పాదన
ABN , First Publish Date - 2020-12-17T08:08:15+05:30 IST
శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం పునరుద్ధరణ పనులు రానున్న జూన్ నాటికీ పూర్తవుతాయని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి

హైదరాబాద్, నాగర్‌కర్నూల్, డిసెంబరు 16 (ఆంధ్ర జ్యోతి): శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం పునరుద్ధరణ పనులు రానున్న జూన్ నాటికీ పూర్తవుతాయని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 2 యూనిట్ల పునరుద్ధరణ పూర్తయిందని, ఈ నెలాఖరుకు మరో యూనిట్ సిద్ధం అవుతుందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఇంకో 2 యూనిట్లు అందుబాటులోకి వస్తాయని, అగ్ని ప్రమాదంలో ఎక్కువగా దెబ్బతిన్న నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.