తుంగభద్ర పుష్కరాలకు పౌర్ణమి శోభ

ABN , First Publish Date - 2020-12-01T08:07:51+05:30 IST

తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాల 11వ రోజైన సోమవారం.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పుష్కరఘాట్లలో 1.15 లక్షలకు పైగా భక్తులు పుష్కరస్నానాలు

తుంగభద్ర పుష్కరాలకు పౌర్ణమి శోభ

1.15 లక్షల మంది భక్తుల పుష్కరస్నానాలు.. నేటితో ముగియనున్న పుష్కరాలు


గద్వాల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాల 11వ రోజైన సోమవారం.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పుష్కరఘాట్లలో 1.15 లక్షలకు పైగా భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. అలంపూర్‌ పుష్కరఘాట్‌లో 51,445 మంది, పుల్లూరులో 25,695 మంది, రాజోలిలో 25,120 మంది, వేణిసోంపురంలో 13,200 మంది భక్తులు పుష్కరస్నానాలు చేశారు. సోమవారం కార్తీక పౌర్ణమికావడంతో  భక్తుల రద్దీ బాగా కనిపించింది. మంగళవారం పుష్కరాలు ముగియనుండటంతో భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. 11 రోజుల్లో నాలుగు పుష్కరఘాట్లలో 3,53,787 మంది పుష్కరస్నానాలను ఆచరించారు. అలంపూర్‌లో పుష్కరస్నానాల అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి భక్తులు క్యూలో నిల్చున్నారు. మూడు గంటలపాటు క్యూలో నిలబడటంతో కొందరు వృద్ధులు, ఉపవాసాలున్నవారు కింద కూర్చోవడం, కళ్లు తిరిగిపడిపోవడం కనిపించింది. 

Updated Date - 2020-12-01T08:07:51+05:30 IST