రేపటినుంచి పనిచేయనున్న ప్రభుత్వ కార్యాయాలు

ABN , First Publish Date - 2020-05-11T00:44:31+05:30 IST

లాక్ డౌన్ సడలింపులు వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ప్రైవేటు రంగానికి ఇచ్చిన మినహాయింపుల మేరకు ఇప్పటికే షాపులు తెరచుకున్నాయి. ఇదే క్రమంలో... ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ జోన్లలోని ఆఫీసర్లు, స్టాఫ్​ అందరూ సోమవారం నుంచి డ్యూటీకి హాజరుకావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి సేవలను అందుబాటులోకి తేవాలని సూచించింది.

రేపటినుంచి పనిచేయనున్న ప్రభుత్వ కార్యాయాలు

హైదరాబాద్ : లాక్ డౌన్ సడలింపులు వేగంగా అమల్లోకి వస్తున్నాయి. ప్రైవేటు రంగానికి ఇచ్చిన మినహాయింపుల మేరకు ఇప్పటికే షాపులు తెరచుకున్నాయి. ఇదే క్రమంలో... ఇక గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని అన్ని ప్రభుత్వ కార్యాయాలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ జోన్లలోని ఆఫీసర్లు, స్టాఫ్​ అందరూ సోమవారం నుంచి డ్యూటీకి హాజరుకావాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూర్తి సేవలను అందుబాటులోకి తేవాలని సూచించింది.


అన్ని డిపార్ట్​మెంట్లలో... సీఎం ప్రకటించిన మేరకు రాష్ట్రంలో రెండో దశ లాక్​డౌన్​ ఏడో తేదీ వరకు అమలైంది.తొమ్మిదిన... రెండవ శనివారం, పదిన ఆదివారం ఉండటంతో… పదకొండవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో డ్యూటీలకు హాజరు కావాలని ఉద్యోగులకు ఆదేశాలందాయి. రాష్ట్రంలో అన్ని డిపార్టుమెంట్లలో కలిపి 2.90 లక్షల మంది ఉద్యోగులు, 20 వేల మంది వరకు యూనివర్సిటీల సిబ్బంది ఉన్నారు. వీరికితోడు కాంట్రాక్టు, ఔట్​‌సోర్సింగ్ సిబ్బంది కలిపి మొత్తం లక్షకు పైగా ఉద్యోగులున్నారు. ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్‌‌–రూరల్ డెవలప్​మెంట్, అగ్రికల్చర్ ​డిపార్ట్​మెంట్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి.


సోమవారం నుంచి మిగతా డిపార్ట్​మెంట్లు పనిచేయనున్నాయి. రెడ్ జోన్లలో ప్రస్తుతమున్న పరిస్థితే కొనసాగనుంది. రెడ్ ​జోన్లలోని గవర్నమెంట్  ఆఫీసుల్లో 33 శాతం చొప్పున సిబ్బంది రొటేషన్​ పద్ధతిలో హాజరవుతారు. డిప్యూటీ సెక్రెటరీ, ఆ పైస్థాయి అధికారులు రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్ ​అర్బన్  జిల్లాలు రెడ్​జోన్​లో ఉన్నాయి. గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వరంగల్​ అర్బన్​ను ఆరెంజ్ జోన్​ కిందకు మార్చాలని కేంద్రానికి సర్కారు సిఫారసు చేసింది. సోమవారం నాటికి ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. ఇది జరిగితే రాష్ట్రంలో 28 జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉంటాయి. వాటిల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయి. 

Updated Date - 2020-05-11T00:44:31+05:30 IST