నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
ABN , First Publish Date - 2020-12-20T03:52:47+05:30 IST
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

భూపాలపల్లిటౌన్, డిసెంబరు 19 : నిరుద్యోగ యువతీ యువకులకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పిస్తున్నట్లు నిర్వాహకుడు ఇమ్మడిశెట్టి దేవేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుంచి 35 ఏళ్ల వయసు మధ్య వయసు ఉండి ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారికి ఆటో సర్వీస్ టెక్నీషియన్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం భారత ప్రభుత్వ ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆరు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, స్టడీ సర్టిఫికెట్, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతో హన్మ కొండలోని బీమారం వద్ద ఉన్న ప్రథమ్ ఫౌండేషన్ కార్యాల యంలో సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9177998599, 9346468432 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.