ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2020-08-12T12:19:43+05:30 IST

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పోటీ పరీక్షలకు హాజరయ్యే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలిపింది. నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఫర్‌ ఎస్సీ, ఎస్టీ ఆధ్వర్యంలో మూడు కోర్సులను ప్రముఖ శిక్షణా కేంద్రాల ద్వారా అందిస్తున్నామని వివరించింది. ఎస్‌ఎ్‌ససీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఐబీపీఎస్‌, ఎల్‌ఐసీ సంస్థల్లో ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణనిస్తామని తెలిపింది. కంప్యూటర్‌ ఓ లెవల్‌, హార్డ్‌వేర్‌ కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి 18-30 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులని, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువైన పాఠ్యా పుస్తకాలు, నెలకు రూ.1000 స్టైఫండ్‌ ఉంటుందని తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు హైదరాబాద్‌లోని నేషనల్‌ కేరీర్‌ సర్వీస్‌ సెంటర్‌కు చెందిన ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ క్యాంప్‌సకు దరఖాస్తులను పంపించాలని సూచించింది. 

Updated Date - 2020-08-12T12:19:43+05:30 IST