26,526 మందికి వసతి, భోజనం

ABN , First Publish Date - 2020-04-05T11:29:03+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లలేకపోయిన నిరుపేదలు, వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటోంది. రాష్ట్రంలోని 11 మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 26,526 మందికి అన్నపూర్ణ పథకం కింద వసతితో...

26,526 మందికి వసతి, భోజనం

  • 11 కార్పొరేషన్లలో ఏర్పాట్లు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లలేకపోయిన నిరుపేదలు, వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటోంది. రాష్ట్రంలోని 11 మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 26,526 మందికి అన్నపూర్ణ పథకం కింద వసతితో పాటు భోజనం అందిస్తున్నారు. మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేశారు. బాధితుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా ఉన్నారు. 

Updated Date - 2020-04-05T11:29:03+05:30 IST