ముద్ర రుణాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2020-09-29T08:07:28+05:30 IST

నిన్నమొన్నటి వరకు బ్యాంకు అధికారులమంటూ బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీస్‌ అధికారుల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాలతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చిన్న, మధ్యతరహా వ్యాపారుల్ని టార్గెట్‌గా చేసుకుని

ముద్ర రుణాల పేరుతో మోసం

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి వరకు బ్యాంకు అధికారులమంటూ బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీస్‌ అధికారుల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాలతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చిన్న, మధ్యతరహా వ్యాపారుల్ని టార్గెట్‌గా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముద్ర రుణాలను ఎరగా వేసి అందినకాడికి దండుకుంటున్నారు. ‘‘మీ వ్యాపారానికి రాయితీతో కూడిన రూ.6 లక్షల ముద్ర రుణం మంజూరైంది. ప్రాసెసింగ్‌ చార్జీలు రూ.45 వేలు చెల్లిస్తే రుణం మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది’’ అని నకిలీ లేఖలను వ్యాపారులకు పంపుతున్నారు. అది నమ్మి వారు సూచించిన ఖాతాలో డబ్బు జమ చేస్తే నిలువునా మోసపోవటమేనని తెలంగాణ సైబర్‌ క్రైం పోలీ్‌సలు హెచ్చరిస్తున్నారు. ముద్ర రుణం పేరుతో ఏదైనా మెసేజ్‌, మెయిల్‌ వస్తే స్పందించవద్దని, మంజూరుకు ఎలాంటి రుసుం చెల్లించవద్దని సూచించారు. ఎవరైనా సైబర్‌ నేరగాళ్లు మోసానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తే సైబర్‌ క్రైం పోలీసుల టోల్‌ ఫ్రీ నెంబరు 155260కు సమాచారం అందివ్వాలని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-09-29T08:07:28+05:30 IST