రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-12-11T04:51:09+05:30 IST
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

చిలుపూర్, డిసెంబరు 10: తాలు, మట్టి తదితర కారణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. గురువారం మండలంలోని రాజవరం, చిలుపూర్ తదితర గ్రామాల్లో ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. నిర్వాహకుల నుంచి ఎదురయ్యే సమస్యలను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధరణి రికార్డులను పరిశీలించారు. చిన్నపెండ్యాల సమీపంలో ఉన్న మీనాక్షి రైస్‌మిల్లును సందర్శించి ధాన్యం సేకరణ గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, డీటీ సూర్య నాయక్, ఏడవెళ్ళి మాధవరెడ్డి, దొడ్డ ఈశ్వరయ్య, ఆర్‌ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.