అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి: వీహెచ్‌

ABN , First Publish Date - 2020-09-16T09:19:27+05:30 IST

పంజాగుట్ట సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి: వీహెచ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అక్కడ నెలకొల్పడానికి తాను తీసుకువచ్చిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని గతేడాది ఏప్రిల్‌లో పోలీసులు స్టేషన్‌కు  తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడంపై అసెంబ్లీలో లేవనెత్తాలంటూ సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను కోరినట్లు తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్‌లో ఏర్పాటు చేయకుంటే తాను నిరవధిక నిరసన దీక్ష చేపడతానని హెచ్చరించారు.

Updated Date - 2020-09-16T09:19:27+05:30 IST