కరోనా రోగులకు సౌకర్యాలేవి?: వీహెచ్‌

ABN , First Publish Date - 2020-07-14T09:02:25+05:30 IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ

కరోనా రోగులకు సౌకర్యాలేవి?: వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎంపీ వి. హన్మంతరావు విమర్శించారు. రోగులకు అవసరమైన మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సౌకర్యాలూ అందజేయలేక పోయారన్నారు. ప్రజారోగ్యాన్ని ఆయన పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగి పోతున్న నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితిని అదుపులోకి తేవాలని సోమవారం ఆయన ఓ ప్రకటనలో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తరచూ హైదరాబాద్‌కు వస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కరోనాను అరికట్టే అంశంపై సీఎం కేసీఆర్‌తో ఎన్నిసార్లు సమావేశమయ్యారని ప్రశ్నించారు. మిగిలిన హైదరాబాద్‌తో పోలిస్తే కిషన్‌ రెడ్డి లోక్‌సభ నియోజకవర్గం సికింద్రాబాద్‌లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.  

Updated Date - 2020-07-14T09:02:25+05:30 IST